ⓘ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

                                     

ⓘ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగుళూరులో గల అంతర్జాతీయ విమానాశ్రయము.

2008, మే 23వ తేదీన కర్ణాటక రాష్ట్రపు మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ప్రారంభించబడింది. బెంగళూరు నగరం నుండి సుమారు 32 కి.మీ.దూరంలో ఉన్న ఈ విమానాశ్రయానికి రహదారి మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. "హైస్పీడ్ రైలు", "ఎక్స్‌ప్రెస్ వే" మార్గాల బ్లూప్రింట్ తయారు చేయబడింది. టాక్సీ సౌకర్యం, ప్రతి 15 నిమిషాలకొక కె.ఎస్.ఆర్.టి.సి.బస్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. బెంగళూరు ఏ మూల నుండి ఐనా గంట, గంటన్నరలోపు విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రయాణీకుల సౌకర్యం కొరకు "బి.ఐ.ఎ.ఎల్ సహాయవాణి" సౌలభ్యం ఉంది. సహాయవాణి సంఖ్య:40581111 ద్వారా విమానాశ్రయానికి రవాణా సౌకర్యాల వివరాలు, ఇతర సాధారణ విషయాలు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. విమానాశ్రయంలో 53 చెక్-ఇన్ కౌంటర్లు, 18 స్వయం పరిశీలన యంత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. పిల్లల సౌకర్యం కొరకు ఔషధాలయం, డయాపర్లు మార్చుటకు, పిల్లలకు పాలుత్రాగించడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి.