ⓘ కైలాషహర్

                                     

ⓘ కైలాషహర్

త్రిపురి రాజ్యానికి ప్రాచీన రాజధానిగా ఉన్న కైలాషహర్ చరిత్ర ఉనకోటితో ముడిపడి ఉంది. త్రిపురబ్దా త్రిపురి క్యాలెండర్ను ప్రారంభించిన శివ శిష్యుడు, మౌ నది ఒడ్డున ఉన్న చంబుల్ నగర్ గ్రామంలో శివుడి కోసం ప్రార్థించాడు. రాజ్‌మలాలో ప్రస్తావించబడిన చంబుల్‌నగర్ ప్రాంతం, ఉనకోటి కొండ సమీపంలో ఉందని తేలింది. ఈ పురాణ చంబుల్ నగర్ ప్రాంతమే నేటి కైలాషహర్ కావచ్చని కొందరి అభిప్రాయం. హర్ శివ కైలాష్‌లో నివసించడం వల్ల, ఈ ప్రాంతాన్ని కైలాష్ హర్ అని పిలిచేవారు, తరువాత దీనిని కైలాషహర్‌గా మార్చారు. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాంన్ని త్రిపుర రాజు ఆది-ధర్మఫా పరిపాలించాడు. ఆ రాజు తన ఆడంబరం, ఆనందంతో ఇక్కడ ఒక యజ్ఞం చేసాడు.

                                     

1. జనాభా

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, కైలాషహర్ పట్టణంలో 23.418 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు. కైలాషహర్ సగటు అక్షరాస్యత రేటు 82% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 84% కాగా, స్త్రీల అక్షరాస్యత 79%గా ఉంది. కైలాషహర్‌లో జనాభాలో 10% మంది 6 సంవత్సరాలలోపు వయస్సు గలవారు ఉన్నారు.

                                     

2. రవాణా

కైలాషాహర్ పట్టణం నుండి భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు రోడ్డుమార్గం ద్వారా రవాణా సౌకర్యం ఉంది. ఈ పట్టణంలో విమానాశ్రయం కూడా ఉంది. దీనికి సమీపంలోని కుమార్‌ఘాట్‌లో రైల్వే స్టేషను ఉంది.

                                     

3. మతాలు

ఇక్కడ హిందూమతం ఎక్కువగా ఉండడంవల్ల ఈ పట్టణంలో అనేక దేవాలయాలు లక్ష్మీ నారాయణ్ దేవాలయం, 14 దేవతల ఆలయం చౌడూ దేవతార్ మందిర్, రంగౌటి దేవాలయం) ఉన్నాయి. ముస్లింల కోసం ఒక మసీదు కూడా ఉంది. ఇక్కడ బౌద్ధ మతం, క్రైస్తవ మతం వారు కూడా ఉన్నారు.